Thursday, November 21, 2024

విద్యాదీవెన కింద బాబు, పవన్ లకు చదువు చెప్పించండి ప్లీజ్ : జగన్ కు రోజా విజ్ఞప్తి

నగరి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో ) : జగనన్న విద్యా దీవెన పథకం కింద ఎందరికో ఉన్నత చదువులకు అవకాశం కల్పిస్తున్నట్టే ప్రత్యేకంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు చదువుకునే అవకాశం కలిపించాలని రాష్ట్ర పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్ కే రోజా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి విజ్ఞప్తి చేసారు. చిత్తూరు జిల్లా నగరిలో ఈరోజు జరిగిన జగనన్న విద్యా దీవెన పథకం బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి, రోజా ప్రధాన ప్రతిపక్షాలపై విసుర్లతో, విమర్శలతో విరుచుకు పడ్డారు.

ఆమె తన ప్రసంగంలో ఎమన్నారంటే…

” జగనన్నకు ఒక చిన్న రిక్వెస్ట్, అన్నా ఇన్ని లక్షల మందికి విద్యాదీవెన ఇస్తున్నాం, కానీ ఇంకో ఇద్దరికి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా, వారు ఎవరో కాదు పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు, పవన్‌ ఒక ఇంటర్వ్యూలో ఇంటర్‌లో తను సీఈసీ అని ఒకసారి హెచ్‌ఈసీ అని ఒకసారి ఎంపీసీ అంటారు, చంద్రబాబు ఇంజినీరింగ్‌ చదవాలంటే ఇంటర్‌లో బైపీసీ గ్రూప్‌ తీసుకోవాలంటారు, వీరిద్దరికీ విద్యాదీవెన వర్తింప చేయాలంటే ఏపీలో వారికి ఇల్లు లేదు ఓటు లేదు ఆధార్‌ కార్డు కూడా లేదు. కాబట్టి సీఎంగా మీకు స్పెషల్‌ పవర్స్‌ ఉంటాయి, అవి ఉపయోగించి వారిద్దరికీ విద్యాదీవెనతో మంచి చదువు చెప్పించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను, వీరంతా కూడా పిచ్చిపిచ్చి మాటలతో ఊగిపోతూ ఒకడు, జారిపోతూ ఒకడు, మరిచిపోతూ ఒకడు రాష్ట్రంలో ప్రజలను విసిగిస్తున్నారు. విద్యార్ధుల్లారా మీకందరికీ ఒకటే చెబుతున్నా, టీడీపీని నమ్ముకుంటే విద్యార్ధులు జైళ్ళకు వెళతారు, పవన్‌ను నమ్ముకుంటే సినిమాలకు వెళతారు కానీ జగనన్నను నమ్ముకుంటే మంచి కాలేజీలకు, యూనివర్శిటీలకు వెళ్లి జీవితంలో చక్కగా సెటిలవుతారు. జగనన్న ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని కూడా నెరవేర్చారు, 2019 ఎన్నికల తర్వాత ఏ ఎన్నికలు అయినా వార్‌ వన్‌ సైడ్, అలాంటి జగనన్నను కొంతమంది ఓడిస్తామని, కొంతమంది ఆడిస్తామని, కొంతమంది పాలిస్తామంటున్నారు, కానీ అలా ఎవరూ పుట్టలేదు, జగనన్నను ఓడించాలంటే ఆ పక్కన కూడా జగనన్నే ఉండాలి, జగనన్నను ఆడించాలంటే ఆ పక్కన కూడా జగనన్నే ఉండాలి కానీ మీలా టైం పాస్‌ రాజకీయాలు చేస్తూ, షూటింగ్‌ గ్యాప్‌లలో వచ్చి, ప్యాకేజీలకు మాట్లాడేవారు మీరే ఎమ్మెల్యేగా గెలవలేదు, మీరు ఇంకేం జగనన్నను ఓడిస్తారు, ఆడిస్తారు. చంద్రబాబు, పవన్, లోకేష్‌ ఊరుఊరు తిరుగతూ విమర్శలు చేస్తున్నారు, నాకు ఈ మధ్యే రిలీజయిన రజనీకాంత్‌ సినిమా డైలాగ్‌ గుర్తుకొస్తుంది, మొరగని కుక్కలేదు, విమర్శించని నోరూ లేదు, ఈ రెండూ లేని ఊరే లేదు, ఇదే డైలాగ్‌ తమిళ్‌లో కూడా చెప్పారు. పవన్‌ ఎంత విమర్శించినా, లోకేష్‌ ఎంత మొరిగినా, చంద్రబాబు ఊరూరు తిరిగి ఎన్ని అబద్దాలు చెప్పినా 2024 జగనన్న వన్స్‌మోర్‌ అని ప్రజలు పట్టం కట్టి 175 సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నేను ధైర్యంగా రాయలసీమ గడ్డపై నుంచి చంద్రబాబుకు సవాల్‌ చేస్తున్నా, నిన్ను సీఎం చేసిన కుప్పంకు వెళదాం, అక్కడ ప్రతి ఇంటికి సంక్షేమాన్ని ఇచ్చింది నువ్వా జగనన్నా అడుగుదాం, నాన్న కొడుకులు గల్లి గల్లి తిరిగినా ప్రజలు హైదరాబాద్‌ తరిమితరిమి కొట్టారు, కుప్పం ప్రజలకు కావాల్సిన మున్సిపాలిటీ కానీ, రెవెన్యూ డివిజన్‌ కానీ అభివృద్ది కానీ సంక్షేమం కానీ అన్నీ ఇచ్చింది మా జగనన్నే. మా అన్న తెల్ల షర్ట్‌తో చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తే ఇది చూసి కూడా పవన్‌ కళ్యాణ్‌ ఏడుస్తున్నాడు, నాకు అర్ధం అయింది ఏంటంటే నాకన్నా చిన్నవాడు నాకన్నా అందంగా ఉంటాడు, సీఎంగా తిరుగులేని నాయకుడిగా ప్రజలందరి గుండెల్లో స్ధానం సంపాదించుకున్నాడు అని జెలసీతో ఫీలవుతున్నాడు, జగనన్నా మీకు ఇంకో రిక్వెస్ట్‌ చంద్రబాబు, పవన్‌కు ఆరోగ్యశ్రీ కింద జెలసీకి మంచి ట్రీట్మెంట్‌ ఇవ్వండి.. ” అని అన్నారు..


రోజా ప్రసంగం వింటూ సి ఎం జగన్ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement