ఏలూరు – ఎపిలో కురుస్తున్న భారీ వర్షాలకు పలుప్రాంతాలలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.. గత కొంతకాలంగా రోడ్ల మరమ్మతు చేయకపోవడంతో గుంతలతో పూర్తిగా పాడయ్యాయి.. దీంతో ఈ ప్రాంత ప్రజలు అధ్వాన రహదారులతో నిత్యం నరకం చూస్తున్నామని వాపోతున్నారు.. వీధులు సరే ప్రధాన మార్గలు సైతం గుంతలు నిండిన రోడ్లపై ప్రయాణానికి నానా అవస్థలు పడుతున్నామని, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్న పలితం లేకుండా పోయిందని అంటున్నారు..
దీంతో దీంతో కడుపు మండిన ఓ యువకుడు వినూత్నంగా నిరసన తెలిపాడు. ఏలూరు జిల్లా కేంద్రం నుంచి మాదేపల్లి వెళ్లే రోడ్డులో ఫిల్‌హౌస్‌పేట వద్ద మడుగులా మారిన రోడ్డు మీద మంచం వేసుకుని పడుకున్నాడు. అటుగా వస్తున్న బస్సును ముందుకు వెళ్లనీయకుండా గంటసేపు ఆపేసి నిరసన తెలియజేశాడు. తర్వాత స్థానికులు అతనికి సర్దిచెప్పి పక్కకు తీసుకురావటంతో బస్సు కదిలింది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం కళ్లు తెరచి రోడ్లను బాగు చేయాలని కోరుతున్నారు..