Tuesday, November 26, 2024

ప్రమాదకరంగా మారిన రహదారి

బల్లికురవ-మార్టూరు ప్రధాన రహదారి గోతులమయంగా మారి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వారం రోజులకు పైగా ప్రతిరోజు కురుస్తున్న వర్షపు జల్లులతో, మోకాలిలోతు గోతులలో నీరు నిలిచి, ఎక్కడ ఏముందో తెలియని ప్రమాదభరితంగా రహదారి మారింది. మంగళవారం మార్టూర్ నుండి బల్లికురవ వస్తున్న లోడు లారీ ఈగోతుల కారణంగా రహదారి పక్క మార్జిన్ లోకి జారిపోయింది. కొద్దిలో ఆ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభంపై పడి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. డ్రైవర్ సమయస్ఫూర్తితో ఈ ప్రమాదం తప్పింది. సత్వరం రెండు క్రేన్ లను రప్పించడం ద్వారా రహదారిలోకి లారీని పైకి తీసుకు రాగలిగారు. దాదాపు మూడు గంటలసేపు మార్టూరు-బల్లికురవ రహదారి మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement