Saturday, January 4, 2025

Amaravati | ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ర‌హ‌దారుల అభివృద్ధి ప‌నులు : ఎంపి కేశినేని

(ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : కొద్ది రోజుల్లో మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్‌తో పాటు, తొలిద‌శ‌లో గ‌న్న‌వ‌రం నుంచి మెట్రో కారిడార్ ప‌నులు మొద‌లైతే విజ‌య‌వాడలో ట్రాఫిక్ స‌మ‌స్య మ‌రింత‌గా పెరుగుతుందని, అలాగే ఆటోన‌గ‌ర్ లోకి లారీలు రావ‌టం క‌ష్టంగా మారుతుందని, అందుక‌ని ఫ్లైఓవర్‌, మెట్రో కారిడార్ ప‌నులు పూర్తి అయ్యే వ‌ర‌కు ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్ర‌త్యామ్నాయ మార్గాల‌పై దృష్టిసారించి, వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు త్వ‌రిత‌గ‌తిన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ తెల‌పారు.

సోమ‌వారం ఎంపీ శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్, క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ల‌తో క‌లిసి ఆటోన‌గ‌ర్ లోని బ‌ల్లెం వారి వీధి, మ‌హానాడు రోడ్, శ‌క్తి క‌ళ్యాణ మండ‌పం రోడ్లు ప‌రిశీలించారు. ఆ ప్రాంతాల్లో ప‌ర్య‌టించి చేప‌ట్టాల్సిన ర‌హ‌దారుల అభివృద్ది ప‌నుల‌తో పాటు లింక్ రోడ్ల‌ను ప‌రిశీలించారు. ఈ ర‌హ‌దారుల్లోకి లారీలు అనుమతి ఇస్తే ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వుంటుంద‌నుకున్నారు.

- Advertisement -

అలాగే గ‌న్న‌వ‌రం వెళ్లేందుకు ప్ర‌త్యామ్నాయ మార్గంగా రామ‌వ‌రప్పాడు నుంచి ఎస్.ఎల్.వి గ్రాండ్ మీదు కేస‌రిప‌ల్లి కి వెళ్లే ర‌హ‌దారిని ప‌రిశీలించారు. అనంత‌రం ఎంపి కేశినేని శివ‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ… రోజురోజుకు పెరుగుతున్న విజ‌య‌వాడ న‌గ‌ర అవ‌సరాల‌కు త‌గ్గ‌ట్లు దార్శ‌నిక‌త‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి ప‌నుల‌పై దృష్టిపెట్టింద‌ని.. ఈ నేప‌థ్యంలో స‌మ‌ష్టి కృషితో ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ర‌హ‌దారుల‌తో పాటు మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు కృషిచేస్తున్న‌ట్లు తెలిపారు.

న‌గ‌రంలో అభివృద్ధి ప‌నుల నేప‌థ్యంలో ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్ర‌జ‌లు స‌జావుగా రాక‌పోక‌లు సాగించేందుకు వీలుగా ఇప్ప‌టినుంచే ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్ల‌పై దృష్టిసారిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

మహానాడు రోడ్డు నుంచి నిడమానూరువరకు ఫ్లైఓవర్‌తో పాటు తొలిద‌శ‌లో గ‌న్న‌వ‌రం నుంచి మెట్రో కారిడార్ ప‌నులు పూర్త‌యితే విజ‌య‌వాడ మ‌రింత శ‌ర‌వేగంగా అభివృద్ధి ప‌థంలో ప‌య‌నించేందుకు వీల‌వుతుంద‌న్నారు. ఈ ప‌నులు పూర్త‌య్యేలోపు ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్ర‌త్యామ్నాయ మార్గాల‌పై దృష్టిసారిస్తున్న‌ట్లు వివ‌రించారు.

ఈ కార్యక్రమంలో స్వ‌చ్ఛంధ్ర కార్పొరేష‌న్ చైర్మ‌న్ కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్ , సబ్ కలెక్టర్ కావూరి చైతన్య , ఈస్ట్ తహసిల్దార్ రోహిణి దేవి , కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, ఐల మాజీ చైర్మన్ సుంకర దుర్గాప్రసాద్ , టిడిపి నాయకులు గద్దె రమేష్ గారు, సూర‌ప‌నేని సురేష్, కోనేరు నాగేంద్ర కుమార్ (నాని), గొల్లపూడి నాగేశ్వరావు గారు, కోడూరు ఆంజనేయ వాసు , గుళ్ల‌ప‌ల్లి నారాయణరావు , మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement