Friday, November 22, 2024

Road Closed – ఆ రూట్‌లో వెళ్లొద్దు! శ్రీశైలం భక్తులకు హెచ్చ‌రిక‌

భారీ వ‌ర్షాల నేప‌థ్యం
విరిగిప‌డుతున్న కొండ‌చ‌రియ‌లు
రోడ్డుపైకి దొర్లుతున్న బండ‌రాళ్లు
శ్రీ‌శైలం ఘాట్ రోడ్‌లో ర‌హ‌దారి ఇబ్బందులు
కీలక ఆదేశాలు జారీ చేసిన పోలీసులు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌:
కుండపోత వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌–శ్రీశైలం జాతీయ రహదారిపై పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నాగర్‌కర్నూలు జిల్లా ఆమ్రాబాద్‌ మండలం ఈగలపెంట పాతాళ గంగ మధ్య సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ప‌లు చోట్ల కొండచరియలు విరిగిపడ్డ‌ట్టు తెలుస్తోంది. బండరాళ్లు రోడ్డుపైకి దొర్ల‌డంతో శ్రీశైలం ఘాట్‌ రోడ్డు మార్గంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -

శ్రీ‌శైలం టూర్ పోస్టుపోన్ చేసుకోండి..

ఈ నేపథ్యంలో నాగర్‌కర్నూలు ఎస్పీ గైక్వాండ్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వైపు వెళ్లొద్దని సూచించారు. ఘాట్‌ రోడ్డు మార్గంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా శ్రీశైలం పర్యటనను విరమించుకోవాలని ఆదేశించారు. కాగా నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్రతండా వద్ద తెలంగాణ పోలీసులు ఓ చెక్‌పోస్టును కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నుంచి వస్తున్న ప్రయాణికులను మధ్యలోనే ఆపి వెనక్కి పంపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement