Home ఆంధ్ర‌ప్ర‌దేశ్ Road Accident: స్కూటీ ని ఢీకొన్న టిప్పర్ – ముగ్గురి దుర్మరణం

Road Accident: స్కూటీ ని ఢీకొన్న టిప్పర్ – ముగ్గురి దుర్మరణం

0
Road Accident: స్కూటీ ని  ఢీకొన్న టిప్పర్ – ముగ్గురి దుర్మరణం

బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబోట్లవారిపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్, స్కూటీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.

మృతుల్లో స్కూటీపై వెళ్తున్న అత్త, అల్లుడు, కూతురు ఉన్నారు. మృతులు మేదరమెట్లకు చెందిన అత్త షేక్ చినబుడెమ్మ (40), అల్లుడు షేక్ మస్తాన్ వలి(30), కూతురు షేక్ అమీరున్ (20)గా గుర్తించారు. చీరాల మండలం వాడరేవు సముద్ర స్నానానికి వెళ్లి పర్చూరు మీదుగా ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ముగ్గురి మృతితో మేదరమెట్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version