ప్రకాశ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గత అర్థరాత్రి జరగిన ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఒంగోలు-కర్నూలు రహదారిపై జరిగింది ఘటన. తర్లుపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ దగ్గర రోడ్డుపై చనిపోయిన గేదెపైకి టాటా ఏస్ వాహనం ఎక్కింది. దీంతో అదుపుతప్పి వాహనం.. ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వేగంగా వచ్చిన టిప్పర్ దానిని ఢీకొనడంతో ఆటో నుజ్జయింది. అందులోని ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులను దర్శి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలో 14 మంది ఉండగా, ఆటో డ్రైవర్ వెంకటేశ్వరరెడ్డి కూడా ఉన్నాడు. వీరందరూ కొత్తపల్లిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై వస్తుండగా ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదం జరగడానికి ముందు ఓ టిప్పర్.. రోడ్డు దాటుతున్న గేదెను ఢీకొట్టడంతో అది అక్కడిక్కడే మృతి చెందింది. ఆ తర్వాత అదే రోడ్డుపై వచ్చిన ఆటో చనిపోయి పడివున్న గేదెను గమనించకపోవడంతో దానిపైకి ఎక్కింది. దీంతో ఆటో బోల్తాపడబోతుండగా డ్రైవర్ నియంత్రించే ప్రయత్నం చేశాడు.
ఇది కూడా చదవండి: నైటీలు ధరించి దొంగతనాలకు వచ్చిన దుండగులు