Sunday, November 17, 2024

RIP – ప్రభుత్వ అధికార లాంచనాలతో రామ్మూర్తినాయుడి అంత్య‌క్రియ‌లు

ఆంధ్రప్రభ స్మార్ట్, నారావారిప‌ల్లె : ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు శ‌నివారం మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఇవాళ నారావార‌ప‌ల్లెలో ప్రభుత్వ అధికార లాంచనాలతో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. ముందుగా రామ్మూర్తి ఇంటి వద్ద నుంచి ఆయ‌న అంతిమయాత్ర ప్రారంభ‌మైంది. సోదరుడు పాడెను చంద్రబాబు స్వయంగా మోసారు . ఈ యాత్ర‌లో నారా, నంద‌మూరి కుటుంబాల‌తో పాటు పెద్ద సంఖ్య‌లో టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, స్థానిక ప్ర‌జ‌లు పాల్గొన్నారు. రామ్మూర్తి నాయుడు కుమారులు రోహిత్, గిరిష్ అంతిమ యాత్ర‌లో ముందున‌డ‌వ‌గా చంద్ర‌బాబు, నారా లోకేష్ త‌దిత‌రులు అనుస‌రించారు. కాగా, తల్లిదండ్రుల సమాధుల పక్కనే రామ్మూర్తినాయుడు అంత్యక్రియల నిర్వహించారు.

అంత‌కు ముందు..

హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో రామ్మూర్తినాయుడు పార్థివదేహాన్ని నేటి ఉద‌యం రేణిగుంట‌కు చేర్చారు. అక్క‌డి నుంచి నారావారిపల్లెకు తరలించారు. మంత్రి నారా లోకేశ్ తన చిన్నాన్న భౌతికకాయాన్ని దగ్గరుండి తీసుకొచ్చారు.

కాగా, తన తమ్ముడు రామ్మూర్తినాయుడు అంత్యక్రియల కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నారావారిపల్లెకు చేరుకున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, ఇతర కుటుంబసభ్యులు ఉన్నారు. మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ కూడా చంద్రబాబుతో పాటు వచ్చారు.

- Advertisement -

చివ‌రి సారిగా..నారావారిప‌ల్లెలో మ్మూర్తి పార్థివదేహాన్ని ప్రజాప్రతినిధులు, నేతలు, ప్రజల సందర్శనార్థం ఉంచారు. దీంతో అభిమానులు, టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్తలు , ప‌లువురు ప్ర‌ముఖులు త‌ర‌లివ‌చ్చి అంజ‌లి ఘ‌టించారు. తమ అభిమాన నాయుకుడిని కడసారి చూసుకోవడానికి అధిక సంఖ్యలో ప్రజలు, రాజకీయ నాయకులు తరలివచ్చారు. రామ్మూర్తి నాయుడు పార్థీవ‌దేహం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

త‌ర‌లివ‌చ్చిన ప్ర‌ముఖులు

మహారాష్ట్ర గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్, కలెక్టర్ వెంకటేశ్వ ర్, ఎస్పీ సుబ్బారాయుడు, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆదిమూలం, అమరనాథ్ రెడ్డి,గురజాల జగన్మోహన్, బొజ్జల సుధీర్ రెడ్డి, కె.రామకృష్ణ, కె.రామకృష్ణ, కె.మురళీమోహన్, గాలి భాను ప్రకాష్, మాజీ రాజ్యసభ సభ్యులు యం.మోహన్ బాబు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యేలు మోహన్, శ్రీనాధ్ రెడ్డి. ఏ.ఎస్.మనోహర్, చదలవాడ కృష్ణమూర్తి, ఎస్ సి వి నాయుడు, ప్రముఖ సినీ ప్రముఖులు రాజేంద్రప్రసాద్, మంచు మనోజ్, నాగ సౌర్య, టీటీడీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి, ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, చుట్టుపక్కల గ్రామస్తులు నారా రామ్మూర్తి నాయుడు పార్థవదేహాన్ని సందర్శించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement