Sunday, November 17, 2024

RIP – ప్రభుత్వ అధికార లాంచనాలతో రామ్మూర్తినాయుడి అంత్య‌క్రియ‌లు

తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. రామ్మూర్తి నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ముగిశాయి. రామ్మూర్తి నాయుడు పెద్ద కుమారుడు, సినీ హీరో నారా రోహిత్ తండ్రి పార్థివదేహానికి తలకొరివిపెట్టి అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిదండ్రుల అంతిమ సంస్కారాలు నిర్వహించిన చోటే రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు జరిగాయి.

ప్రత్యేక విమానంలో పార్థివ దేహం

హైదరాబాద్ బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం ఉదయం రామ్మూర్తి నాయుడు పార్థివదేహాన్ని రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో నారావారిపల్లెకు తీసుకెళ్లారు. అదే విమానంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, ఇతర బంధువులు వచ్చారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మిణి, మనుమడు దేవాన్ష్ ఇతర కుటుంబ సభ్యులు నారావారిపల్లెకు వచ్చారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి చంద్రబాబుతోపాటు మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణ సైతం గ్రామానికి చేరుకున్నారు.

పాడె మోసిన చంద్రబాబురామ్మూర్తి నాయుడు

అంతిమయాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, కుటుంబ సభ్యులు పాడె మోశారు. మందకృష్ణ మాదిగ డప్పు కొట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు.

- Advertisement -

అంతకు ముందు చివ‌రి సారిగా.

.నారావారిప‌ల్లెలో మ్మూర్తి పార్థివదేహాన్ని ప్రజాప్రతినిధులు, నేతలు, ప్రజల సందర్శనార్థం ఉంచారు. దీంతో అభిమానులు, టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్తలు , ప‌లువురు ప్ర‌ముఖులు త‌ర‌లివ‌చ్చి అంజ‌లి ఘ‌టించారు. తమ అభిమాన నాయుకుడిని కడసారి చూసుకోవడానికి అధిక సంఖ్యలో ప్రజలు, రాజకీయ నాయకులు తరలివచ్చారు. రామ్మూర్తి నాయుడు పార్థీవ‌దేహం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు

రామ్మూర్తి నాయుడు పార్థివదేహం వద్ద ప్రజాప్రతినిధులు, సినీ నటులు నివాళులు అర్పించారు. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, సినీనటులు మోహన్ బాబు, మంచు విష్ణు, రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నివాళులు అర్పించారు.

త‌ర‌లివ‌చ్చిన ప్ర‌ముఖులు

మహారాష్ట్ర గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్, కలెక్టర్ వెంకటేశ్వ ర్, ఎస్పీ సుబ్బారాయుడు, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆదిమూలం, అమరనాథ్ రెడ్డి,గురజాల జగన్మోహన్, బొజ్జల సుధీర్ రెడ్డి, కె.రామకృష్ణ, కె.రామకృష్ణ, కె.మురళీమోహన్, గాలి భాను ప్రకాష్, మాజీ రాజ్యసభ సభ్యులు యం.మోహన్ బాబు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యేలు మోహన్, శ్రీనాధ్ రెడ్డి. ఏ.ఎస్.మనోహర్, చదలవాడ కృష్ణమూర్తి, ఎస్ సి వి నాయుడు, ప్రముఖ సినీ ప్రముఖులు రాజేంద్రప్రసాద్, మంచు మనోజ్, నాగ సౌర్య, టీటీడీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి, ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, చుట్టుపక్కల గ్రామస్తులు నారా రామ్మూర్తి నాయుడు పార్థవదేహాన్ని సందర్శించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement