అనారోగ్యంతో కన్నుమూసిన జగన్ సోదరుడు
నేడు పులివెందులలో అంత్యక్రియలు
పులివెందుల – అనారోగ్యంతో మృతి చెందిన వైఎస్ జగన్ సోదరుడు వైసిపి నేత వైయస్ అభిషేక్ రెడ్డి బౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి ఇవాళ తెల్లవారుజామున పులివెందులకు తీసుకొచ్చారు.. నేడు అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.. ఈ నేపధ్యంలో పులివేందులకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి , వైసిపి అధినేత జగన్ అభిషేక్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. అభిషేక్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.. అంతకు ముందు ఎంపీ అవినాష్ రెడ్డి, బీటెక్ రవి తిదితరులు అబిషేక్ బౌతికకాయంపై పుష్ప గుచ్చం ఉంచి అంజలి ఘటించారు.
- Advertisement -