ఆంధ్రప్రదేశ్ లో సినిమా థియేటర్లపై అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. సినిమా టికెట్ల ధరలు తగ్గించి అమ్మాలన్న ప్రభుత్వం ఆదేశాలపై.. వరుసగా నాలుగోరోజూ రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ సినిమా ప్రదర్శనలు చేస్తున్న థియేటర్లపై ఉక్కు పాదం మోపుతున్నారు. అన్ని రకాల అనుమతులు ఉన్నది లేనిది పరిశీలిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన, టిక్కెట్ల ధరలు అధికంగా అమ్ముతున్న థియేటర్లకు జరిమానాలు విధించడంతో పాటు తాళాలు వేస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తగ్గించిన ధరలతో సినిమాలు ప్రదర్శించలేమంటూ పలు జిల్లాల్లో థియేటర్ల యజమానులు స్వచ్చందంగా మూసివేస్తున్నారు. గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా థియేటర్లు మూసివేసి ఉంచారని, ఇప్పుడు టికెట్ల ధరలు తగ్గించడంతో తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..