Saturday, November 23, 2024

ప్రాణ వాయువుకి ఇంటి సంకెళ్లు – బ‌డాబాబుల ఇళ్ల‌లో నిల్వ‌లు..

ప్రాణభయంతో సిలిండర్లను కొనుగోళ్లు చేస్తున్న బడాబాబులు
దారి మళ్లుతున్న ఆక్సిజన్‌
ఫలితంగానే కోవిడ్‌ ఆస్పత్రులకు ఆక్సిజన్‌ కొరత
అమరావతి, : ప్రాణాపాయ స్థి తిలో కొట్టుమిట్టాడుతున్న కరోనా బాధితులకు ఆక్సిజన్‌ (ప్రాణ వాయువు) తక్షణమే అందించాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా విలువైన ప్రాణం కళ్లముందే గాల్లో కలిసిపోతుంది. గడిచిన మూడునాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్‌ సకాలంలో అందక వందల మంది ప్రాణాలొదిలారు. ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో రోజూ ఏదో ఒకమూల పదుల సంఖ్యలో చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అసలు ఆక్సిజన్‌ నిజంగానే దొరకడం లేదా..? రాష్ట్ర ప్రభుత్వం అవసరాలకు సరిపడా నిల్వలను సమకూర్చుకోలేక పోయిందా..? వైద్యశాలల్లో అవసరాల మేరకు ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో లేవా అంటే.. వీటన్నింటినీ ఒకటే సమాధానం వినిపిస్తోంది.. కనిపిస్తోంది. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా వైద్యశాలల్లో నిల్వ ఉండాల్సిన ప్రాణ వాయువు గడిచిన వారం పదిరోజులుగా ఆయా ఇళ్లల్లో భారీ నిల్వల రూపంలో పేరుకుపోతోంది. ఫలితంగానే అత్యవసర పరిస్థి తుల్లో వైద్యశాలలో అవసరానికి సరిపడా అందుబాటులో ఉండడం లేదు. సాధారణంగా ఆక్సిజన్‌ను ఎక్కువగా వైద్యశాలల్లోనే ఉపయోగిస్తారు. అందుకు సంబంధించిన కంపెనీలు కూడా ఆయా వైద్యశాలలకే సరఫరా చేస్తుంటాయి. ప్రస్తుతం కోవిడ్‌ నేపథ్యంలో ప్రాణాపాయ స్థి తిలో ఉన్న బాధితులకు ఆక్సిజన్‌ అత్యవసరమవుతుంది. అయితే కొన్ని వైద్యశాలల్లో బాధితులకు అవస రానికి సరి పడా బెడ్లు అందుబాటులో లేకపోవడం, కరోనా బారిన పడే వారిలో ఎక్కువ శాతం మంది హోం ఐసోలేషన్‌కు ప్రాధాన్యతనిస్తున్నా రు. దీంతో కొంతమంది ముందు జాగ్రత్తతో ఆక్సిజన్‌ను తమ ఇళ్లల్లో నిల్వ చేసుకుంటున్నారు. ఫలితంగా రాష్ట్రానికి అవసరాలకు మించి ఆక్సిజన్‌ అందుబాటులో ఉన్నా వాటిలో అత్యధిక శాతం ఇళ్లల్లో నిల్వలు పేరుకుపో తుండడంతో కోవిడ్‌ వైద్యశాలల్లో ఆక్సిజన్‌ కొరత వెంటాడుతోంది. ఫలితంగానే రోజూ ప్రతి జిల్లాలో ఆక్సిజన్‌ సకాలంలో అందక పదుల సంఖ్యలో బాధితులు ప్రాణాలొదులుతున్నారు.
రూ. 1 లక్షకు పైమాటే..
కోవిడ్‌కు ముందు ప్రాణవాయువు వైద్యశాలల్లో అత్యవసర పరిస్థి తిలో మాత్రమే రోగులకు ఉపయోగించేవారు. అయితే గత ఏడాది నుంచి కోవిడ్‌ కారణంగా ఆక్సిజన్‌ వాడకం పెరిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే మునుపెన్నడూ లేనివిధంగా డిమాండ్‌ కూడా పెరిగింది. సాధారణ రోజుల్లో 25 నుంచి 50, 100 కేజీల సిలిండర్లలో ఆక్సిజన్‌ నింపి ఆయా వైద్యశాలల్లో అత్యవసర పరిస్థి తుల్లో ఉపయోగించేందుకు అందుబాటులో ఉంచుకునేవారు. అయితే గత ఏడాది మార్చి తరువాత కోవిడ్‌ వెంటాడడం, ఆక్సిజ న్‌ అవసరం పెరగడంతో వాటి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే గత ఏడాది 50 కేజీల ఆక్సిజన్‌ సిలిండర్‌ రూ. 30 నుంచి రూ. 40 వేలు పలికినప్పటికీ చాలామంది బ్లాక్‌లో కొనుగోలు చేసి తమ ఇళ్లల్లో భద్రపరుచుకున్నారు. ప్రస్తుతం అదే సిలిండర్‌ ధర రూ. 1 లక్షకు పెరిగినా లెక్కచేయకుండా పలువురు బడాబాబులు ప్రాణవాయువును ఇంటికి తరలించి సంకెళ్లు వేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని అనేక ప్రైవేట్‌ వైద్యశాలల్లో ఆక్సిజన్‌ కొరత వెంటాడుతోంది. అత్యవసర పరిస్థి తుల్లో కరోనా బాధితులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతా ధికారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న ఏజెన్సీలపై ప్రత్యేక నిఘా పెడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.

దారిమళ్లుతున్న.. ఆక్సిజన్‌
సెకండ్‌ వేవ్‌లో కోవిడ్‌ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మొదటి దశతో పోలిస్తే రెండవ దశ ఉదృతమవుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సెకండ్‌ వేవ్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్నీ ఏర్పాట్లను సిద్దం చేసుకుంటోంది. అందులో భాగంగానే రాష్ట్ర అవసరాలకు సంబంధించి రోజుకు 375 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో 500కు పైగా మెట్రిక్‌ టన్నులను రాష్ట్రంలో అందుబాటులో ఉండేలా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అధికారుల లెక్కల ప్రకారం రాష్ట్రంలో కోవిడ్‌ హాస్పిటల్‌కు సరిపడా ఆక్సిజన్‌ అందుబాటు లో ఉంది. అయితే కొంతమంది బడాబాబులు ఆక్సిజన్‌ సిలిండర్లను బ్లాక్‌లో కొనుగోలు చేసి తమ ఇళ్లల్లో భద్రపరుచుకుంటున్నారు. కేవలం సెకండ్‌ వేవ్‌ ప్రమాదాన్ని దృష్టి లో ఉంచుకుని తమ కుటుంబసభ్యులకు ఎటువంటి ప్రాణ హాని జరగకుండా ఉండాలన్న ముందుచూపుతో వారు ఆక్సిజన్‌ను దారిమళ్లించి తమ ఇళ్లల్లో నిల్వ చేస్తున్నారు. అయితే వారు చేసిన ఆలోచన సరైందో కాదో తెలియదుకానీ.. వారు తీసుకున్న నిర్ణయం వల్ల అత్యవసర పరిస్థి తుల్లో కరోనా బాధితులకు ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కూడా కోల్పోతున్నా రు. అదే ఆయా ఇళ్లల్లో రహస్యంగా నిల్వ ఉంచిన సిలిండర్లు వైద్యశాలల్లో అందుబాటులో ఉండి ఉంటే ఎంతోమంది ప్రాణాలతో బయటపడి ఉండేవారు. కేవలం కొంతమంది స్వార్థపూరిత ఆలోచనల వల్ల రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడిందన్న ప్రచారం సాగుతోం ది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరాలకు మించి ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచుతోం ది. కేవలం దారిమళ్లడం వల్లే పలు వైద్యశాలల్లో ఆక్సిజన్‌ కొరత వెంటాడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement