అమరావతి,ఆంధ్రప్రభ: రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్‌జియుకెటి)లో రెండోదశ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ కోసం 446 జనరల్ కేటగిరీ సీట్లకు గాను, 14 స్పెషల్ కేటగిరీ సీట్లకు గాను జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాను ఆర్‌జియుకెటి అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. ఎంపిక కాబడ్డ అభ్యర్ధులందరికీ కాల్ లెటర్స్‌ను పంపామని, అభ్యర్ధులు కావాలనుకుంటే తమ కాల్ లెటర్స్‌ను యూనివర్శిటీ వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని ఛాన్స్‌లర్ కెసి రెడ్డి చెప్పారు.
కాల్ లెటర్‌లో పొందుపరిచిన సర్టిఫికె ట్స్‌ను అన్నింటినీ తీసుకొని అభ్యర్ధులంతా ఈనెల 31వ తేదీన ఉదయం 8 గంటల కల్లా ఏలూరు జిల్లాలోని నూజివీడు క్యాంపస్‌కు చేరుకోవాలని తెలిపారు. నాలుగు క్యాంపస్‌లకు సంబంధించిన అడ్మిషన్స్ అన్నీ నూజీవీడు క్యాంపస్‌లోనే జరుగుతాయని, అందరూ అక్కడే రావాలని కోరారు.