Sunday, November 17, 2024

Review – తుంగభద్ర ఘటనపై చంద్ర బాబు సమీక్ష

కర్నూల్ బ్యూరో. తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయిన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ ఇంజనీర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తుంగభద్ర డ్యాం సంఘటన ప్రదేశానికి చంద్రబాబు ఆదేశాలతో సెంట్రల్ డిజైన్ కమిషనర్ తో పాటు ఇంజనీరింగ్ డిజైన్స్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసి పంపించడం జరిగిందని ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు వెల్లడించారు.

డ్యాం గేటు కొట్టుకుపోయినందున ప్రజలను అప్రమత్తం చేసేలా జిల్లా కలెక్టర్ తో పాటు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా కౌతాలం, ,కోసిగి, మంత్రాలయం, నందవరం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ప్రజలను హెచ్చరించడంతోపాటు తుంగభద్ర నది తీర ప్రాంతాలలో దండోరా వేయిస్తున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల అధికారులను అప్రమత్తం గా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement