Monday, November 18, 2024

Review – జల్‌ జీవన్‌ మిషన్‌ పథకానికి మ్యాచింగ్ గ్రాంట్… అధికారులకు పవన్ ఆదేశం …

విజయవాడ: జల్‌జీవన్‌ మిషన్‌లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ వివరాలు ఇవ్వాలని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం ఈ పథకం నిధులను వినియోగించుకోలేకపోయిందని వ్యాఖ్యానించారు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగాల అధికారులతో ఆయన నేడు సమీక్ష నిర్వహించారు.

విజయవాడ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమైన డిప్యూటీ సీఎం.. తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల డయేరియా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. తాగు నీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాలని, జల్‌జీవన్‌ మిషన్‌ పథకం నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

- Advertisement -

గ్రీన్ కో ఎనర్జీస్ సంస్థ ఉల్లంఘనలపై ఆరా.

కర్నూలు జిల్లాలోని గని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో- గ్రీన్ కో ఎనర్జీస్ సంస్థ అటవీ భూములను ఆక్రమణ, పర్యావరణ నిబంధనల ఉల్లంఘన పై ఆరా తీశారు పవన్ కళ్యాణ్ . కర్నూలు డి.ఎఫ్.ఓ. శ్యామల, నంద్యాల డి.ఎఫ్.ఓ శివశంకర్ రెడ్డి, పాణ్యం అటవీ శాఖ అధికారి సుబ్బరాయుడు ఇందుకు వివరాలను ఉపముఖ్యమంత్రికి అందజేశారు.. దీనిపై పవన్ సుదీర్ఘంగా అదికారులతో చర్చలు జరిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement