ఆంధ్రప్రభ, అమరావతి: ఈ ఖరీఫ్ సీజన్ ఆరంభం తరుణంలో విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలన వ్యవసాయ శాఖ, పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తన శాఖల అధికారులను ఆదేశించారు. విజయవాడలోని తన నివాసంలో వ్యవసాయ,పశుసంవర్ధక,మత్స్య,మార్కెటింగ్,సహకార, పాడి పరిశ్రమ శాఖల ఉన్నత అధికారులుతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదితో ఖరీఫ్ సీజన్ సమీపించిన తరుణంలో విత్తనాలు, ఎరువులు కొరత రాకూడదని,పంటలకు నాణ్యమైన పురుగులు మందులు అందించాలని,ఈ నెల 18 న రైతన్నలకు అందించే పీఎంకిసాన్ తదితర అంశాలపై చర్చించారు. ప్రతీ అధికారి రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు.
Review – విత్తనాలు, ఎరువుల కొరత ఉండొద్దు … అధికారులతో ఏపీ అగ్రి మినిస్టర్ భేటీ
Advertisement
తాజా వార్తలు
Advertisement