కర్నూలు (మంత్రాలయం): ఆంధ్రప్రదేశ్లోని మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రస్వామి గురువైభోత్సవాలు జరుగుతున్నాయి. ఆదివారం మూడో రోజు రాఘవేంద్ర స్వామిని దర్శించుకోనేందుకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వచ్చారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. మఠం పీఠాధిపతులు సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో అనుగ్రహ ప్రశస్తి అవార్డు పత్రాలను అందజేసి శేషవస్త్రంకప్పి, ఫలమంత్రాక్షతలు, మెమోంటో ఇచ్చి ఆశీర్వదించారు. ఆ తర్వాత మాధవరం రోడ్డులో ఉన్న గోశాలను, పరిమళపాఠశాల, వేదపాఠశాల, దాససాహిత్యం మ్యూజియం వంటి పలు అభివృద్ధి పనులను సందర్శించారు. అభయాంజనేయ స్వామికి మొక్కలు తీర్చుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement