కృష్ణపట్నం కరోనా కంటి చుక్కల మందు వాడి కోలుకున్న విశ్రాంత హెడ్ మాస్టర్ కోటయ్య శనివారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురై నెల్లూరులోని ప్రైవేటు కొవిడ్ ఆస్పత్రిలో చేరిన సంగతిత తెలిసిందే. అయితే, సాయంత్రానికి ఆయన ఆరోగ్యం కుదుటపడి డిశ్చార్జి అయ్యారు. ఆనందయ్య మందుతో కోలుకున్న కోటయ్య నాలుగు రోజుల వ్యవధిలో తిరిగి అస్వస్థతకు గురికావడంతో మందు పనితీరుపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి.
అయితే ఆయన సాయంత్రానికి కోలుకొని తిరిగి ఇంటికి చేరుకున్నారు. కళ్లు మంటలతో పాటు నీరసంగా ఉందంటూ కోట పీహెచ్‌సీకి వెళ్లిన కోటయ్యకు ర్యాపిడ్ టెస్టు చేయగా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. ఆక్సిజన్ లెవల్స్ తగ్గాయనే ఉద్దేశంతో నెల్లూరుకు తీసుకొచ్చారు. అయితే కోటయ్యకు ఆక్సిజన్ లెవల్స్ తగ్గాయని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని, ఆక్సిజన్ 90శాతం ఉందని, నీరసంగా ఉండటంతో నెల్లూరుకు తీసుకొచ్చామని ఆయన కుమార్తె చెప్పారు. తన తండ్రి ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నారని కుమారుడు వెల్లడించారు.
ఇదీ చదవండి: ఏపీలో ఆరోగ్య శ్రీ పరిధిలోకి 95 శాతం ప్రజలు