Saturday, November 23, 2024

వేధింపులు తాళలేక విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్య.. దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్‌ చేయాలి: డీజీపీకి అచ్చెన్నలేఖ

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్​లోని ముమ్మిడివరం మండలం అయినాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం విశ్రాంత ఉద్యోగిపై అధికార పార్టీ నాయకులు వేధింపులకు దిగడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితులను అరెస్టు చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు. ఈ మేరకు డీజీపీకి మంగళవారం రాసిన లేఖలో చిత్తశుద్ధి, నిబద్దతతో వ్యవహరించి శాంతి భద్రతలు పరిష్కరించి అరాచక శక్తుల పట్ల చర్యలు తీసుకుంటారనే నమ్మకంతో లేఖ రాస్తున్నానన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ శ్రేణుల అరాచకాలు పెచ్చుమీరాయని, సామాన్యుల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే దాడులు, ఎదిరిస్తే బెదిరింపులు, ఆస్తుల ధ్వంసాలకు పాల్పడతున్నారని ఆరోపించారు.

డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన రోజునే విశాఖలో పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన తీరు చూశామని, సోమవారం తూర్పుగోదావరి జిల్లా అయినాపురం ప్రాథమిక సహకార సంఘం విశ్రాంత ఉద్యోగి రాయపురెడ్డి కృష్ణమూర్తి.. అధికార పార్టీ నాయకుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా రి-టైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందించడంలో సహకార సంఘం అధికారులు ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని, ఆ జాప్యం వెనుక స్థానిక వైసీపీ నాయకుల ఒత్తిడి ఉందని చెబుతూ వాంగ్మూలం కూడా ఇచ్చారని వివరించారు. ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ కారకులైన వారిపై ఇంత వరకు చర్యలు తీసుకోలేదని, తక్షణమే స్పందించి ఒక వ్యక్తి మరణానికి కారణమైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని, బాధిత కుటు-ంబానికి భరోసా కల్పించాలని లేఖలో అచ్చెన్న డిమాండ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement