విజయవాడ: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో రైల్వే ట్రాక్ దెబ్బతిని విజయవాడ-హైదరాబాద్ మధ్య నిలిచిపోయిన రాకపోకలను రైల్వే శాఖ పునరుద్ధరించింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం సమీపంలో వద్ద ట్రాక్ మరమ్మతులు పూర్తి కావడంతో రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్ వెళ్లే రైళ్లను వరంగల్ మీదుగా పంపిస్తున్నారు. ట్రయల్ రన్లో భాగంగా విజయవాడ నుంచి గోల్కొండ ఎక్స్ప్రెస్ను తొలుత పంపారు. ఆ రైలు విజయవాడ, గుంటూరు, వరంగల్ మీదుగా హైదరాబాద్ వెళ్లింది. అఫ్లైన్లో సర్వీసులను పునరుద్ధరించామని.. డౌన్లైన్లో బుధవారం అర్ధరాత్రికి పనులు పూర్తిచేస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
- Advertisement -