Saturday, November 2, 2024

Results – ఎపి టెట్ అభ్యర్థులకు నిరాశ‌ – ఫలితాలు వాయిదా

తుది కీ విడుద‌ల‌లో జాప్యం
దీంతో నేడు విడుద‌ల కావ‌ల‌సిన రిజ‌ల్డ్స్ కు బ్రేక్
మెగా డిఎస్సీకి క‌స‌ర‌త్తు
16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
ఈ నెల‌లోనే నోటిఫికేష‌న్..
ఫిబ్ర‌వరిలో ప‌రీక్ష‌లు ..

అమ‌రావ‌తి – టెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. ఏపీ విద్యాశాఖ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నేడు టెట్ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ ఫలితాలను నవంబర్ 4వ తేదీన ప్రకటించేందుకు రాష్ట్ర విద్యాశాఖ సిద్ధమైంది. మరోవైపు నవంబర్ 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కానున్నట్లు సమాచారం. తుదీ కీ విడుదలలో జాప్యం జరగటంతో టెట్ ఫలితాల తేదీని మార్చినట్లు స‌మాచారం

- Advertisement -

రాష్ట్రంలో టెట్ పరీక్షలు అక్టోబర్ 3వ తేదినుండి అక్టోబర్ 21వ తేదివరకు జరిగాయి. మొత్తం 17 రోజల పాటు ఈ పరీక్షలను నిర్వహించారు. ప్రతి రోజు 2 షిప్టులుగా పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 3,68,661 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వీరంతా కూడా టెట్ ఫలితాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఏపీ టెట్ రాసిన అభ్యర్థులు తుది కీ కోసం లేదా ఫలితాల కోసం టెట్ అధికారిక వెబ్‌సైట్ https://aptet.apcfss.in/ లో చూడ‌వ‌చ్చు

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ …

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ నవంబర్ 6వ తేదీన విడుదల కానుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కసరత్తు దాదాపు పూర్తి చేసింది. ఈ డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది. నవంబర్ 6వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

మొత్తం పోస్టులో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 6,371 ఉండగా, స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725 పోస్టులు, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీలు)-1,781 పోస్టులు, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీలు)-286 పోస్టులు, ప్రిన్సిపాళ్లు 52పోస్టులు, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధికారికంగా ఏపీ విద్యాశాఖ విడుదల చేసే నోటిఫికేషన్ ద్వారా ఖాళీలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement