అనకాపల్లి – వైసిపిలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది.. మొన్న ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆ పార్టీకి టాటా చెప్పి టిడిపిలో చేరిపోగా తాజాగా సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు.. ఈ మేరకు ఆయన నేడు పార్టీ అధ్యక్షుడు జగన్ కు తన రాజీనామా లేఖను పంపారు.. గతంలో టిడిపిలో కీలకంగా ఉన్న దాడి వీరభద్రరావు గత ఎన్నికలలో వైసిపిలో చేరారు.. ఆయన కుమారుడు రత్నాకర్ వైసిపి అభ్యర్ధిగా విశాఖ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ వారిద్దరూ వైసిపిలోనే కొనసాగారు.. తాజాగా జగన్ ఇన్ ఛార్జీలను, అసెంబ్లీ అభ్యర్ధులను మార్చుతున్న తరుణంలో దాడి, ఆయన కుమారుడు పార్టీకి రాజీనామా చేశారు.. తెలుగుదేశంలో చేరనున్నట్లు సమాచారం.
Resigns – అనకాపల్లి వైసిపిలో ముసలం …సీనియర్ నేత దాడి రాజీనామా…
Advertisement
తాజా వార్తలు
Advertisement