పోలీసు పతకాలకు 942 మంది ఎంపిక
746 మందికి పోలీస్ విశిష్ట సేవా,
101 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు
95 మందికి మెడల్ ఫర్ గ్యాలంట్రీ,
ఇద్దరికి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ మెడల్స్
తెలంగాణ నుంచి 12 మందికి పోలీస్ విశిష్ట సేవా పురస్కారాలు
న్యూ ఢిల్లీ – 2025 రిపబ్లిక్ డే సందర్భంగా పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, పౌర రక్షణ సేవలకు చెందిన మొత్తం 942 మంది సిబ్బందికి గ్యాలంట్రీ అవార్డు లు నేడు కేంద్ర ప్రకటించింది. ఇందులో 746 మందికి పోలీస్ విశిష్ట సేవా (మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్), 101 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 95 మందికి మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇద్దరికి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ పతకాల గ్రహీతలు ఉన్నారు. గ్యాలంట్రీ అవార్డులలో ఎక్కువ భాగం నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో మోహరించిన సైనికులకు అందుకోనున్నారు.. .
తెలంగాణ , ఎపి నుంచి…
ఈ పతకాలలో తెలంగాణ నుంచి 12 మందికి పోలీస్ విశిష్ట సేవా (మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) మెడల్స్ దక్కాయి. తెలంగాణ నుంచి పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్ మన్, ఎస్పీ మెట్టు మాణిక్ రాజ్ రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు.
ఇక ఏపీ నుంచి చీఫ్ హెడ్ వార్డర్ కడాలి అర్జున రావు, వార్డర్ ఉండ్రాజవరపు వీరవెంకట సత్యనారాయణకు కరెక్షనల్ సర్వీస్ విభాగంలో పోలీస్ విశిష్ట సేవా పతాలకు ఎంపికయ్యారు.