Saturday, November 23, 2024

AP | అనుమతి లేని రాజకీయ ప్రకటలను వెంటనే తొలగించండి : ముఖేష్ కుమార్

ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హార్డింగ్లను, పోస్టర్లు, కటౌట్లను తక్షణమే తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.

ఇంకా విధుల్లో చేరని ఎన్నికల అధికారులపై తక్షతమే క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శనివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పర్చేందుకు జిల్లా ఎన్నికల అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆదివారం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement