అమరావతి: కడప జిల్లాలో 20 మంది వైకాపా నేతలకు అనధికారికంగా ఇచ్చిన గన్‌మెన్లను ప్రభుత్వం తొలగించింది. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎన్నికల సంఘానికి (ఈసీ) ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ వారికి 2+2 నుంచి 4+4 వరకు గన్‌మెన్‌లను కేటాయిస్తూ.. ప్రతిపక్షాలకు 1+1 మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. ఇది ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. దీనిని సరిదిద్దేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement