కర్నూలురూరల్, ప్రభన్యూస్ : కర్నూలు రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఎస్.సెంథిల్‌కుమార్ ఆదేశాల మేరకు కర్నూలు రేంజ్ పరిధిలోని కర్నూలు, నంద్యాల జిల్లాలో పనిచేస్తున్న 30 మంది సిఐలను బదిలీచేశారు. కర్నూలు సిసిఎస్‌లో పనిచేస్తున్న పి.శేషయ్యను కర్నూలు తాలుకా అర్బన్ పోలీసుస్టేషన్‌కు బదిలీచేశారు. కర్నూలు వీఆర్‌లో ఉన్న పి.శంకరయ్యను కర్నూలు 4వ పట్టణ అర్బన్ పోలీసుస్టేషన్‌కి, ఇక్కడ పనిచేస్తున్న పి.శ్రీనివాసులురెడ్డిని, కర్నూలు ఫ్యాక్షన్‌జోన్‌కు బదిలీచేశారు.
కర్నూలు ఫ్యాక్షన్ జోన్‌లో పనిచేస్తున్న డి.వెంకటేశ్వరరావును పాణ్యం సర్కిల్‌కు, కర్నూలు పీసీఆర్‌లో పనిచేస్తున్న జి.చంద్రబాబును ఆదోని 3వ పట్టణ అర్బన్ పోలీస్‌స్టేషన్‌కు, కర్నూలు సెబ్‌లో పనిచేస్తున్న బి.మధుసూధన్‌రావును ఎమ్మిగనూరు అర్బన్ పోలీసుస్టేషన్‌కు, కర్నూలు వీఆర్‌లో పనిచేస్తున్న డి.మహేశ్వరరెడ్డిని ఆదోని తాలుకా సర్కిల్‌కి, ఆదోని తాలుకా సర్కిల్లో పనిచేస్తున్న ఎం.పార్థసారథిని ఆదోని ట్రాఫిక్ అర్బన్ పోలీసుస్టేషన్‌కు, ఆదోని ట్రాఫిక్ అర్బన్ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న యు.లక్ష్మయ్యను సిసిఎస్ కర్నూలుకు బదిలీ చేశారు.
అలాగే ఎమ్మిగనూరు పట్టణ అర్బన్ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న కె.శ్రీనివాసనాయక్‌ను ఆదోని 2వ పట్టణ అర్బన్ పోలీసుస్టేషన్‌కు, ఆదోని 2వ పట్టణ అర్బన్ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న పి.శ్రీరాములును ఆదోని పిసిఆర్‌కు బదిలీ చేయడం జరిగింది. కర్నూలు దిశ పోలీసుస్టేషన్లో బి.విక్రమసింహను ఆదోని ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్‌కు, ఆదోని ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న కె.చంద్రశేఖర్‌ను నంద్యాల స్పెషల్‌బ్రాంచ్‌కు, బేతంచెర్ల అర్బన్ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న జి.ప్రియతమరెడ్డిని బేతంచెర్ల అర్బన్ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు. నంద్యాల వీఆర్‌లో పనిచేస్తున్న పి.పులిశేఖర్‌ను నంద్యాల 3వ పట్టణ అర్బన్ పోలీసుస్టేషన్‌కు, కర్నూలు వీఆర్‌లో పనిచేస్తున్న ఎం.దివాకర్‌రెడ్డిని శ్రీశైలం సర్కిల్‌కు, ఆదోని పిసిఆర్‌లో పనిచేస్తున్న టి.అబ్దుల్లాస్‌ను పిసిఆర్ కర్నూలుకు, నంద్యాల వీఆర్‌లో పనిచేస్తున్న బి.ఆర్.కృష్ణయ్యను కర్నూలు వీఆర్‌కు, కర్నూలు వీఆర్‌లో పనిచేస్తున్న బి.గుణశేఖర్‌బాబును డీఎస్‌పి కర్నూలుకు బదిలీ చేశారు.
కర్నూలు వీఆర్‌లో పనిచేస్తున్న టి.సుబ్రమణ్యంను కర్నూలు సిసిఎస్‌కు, ఎం.రంగయ్యనాయుడును కర్నూలు వీఆర్‌కు, కర్నూలు తాలుకా అర్బన్ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న కంబగిరిరాముడును కర్నూలు సిసిఎస్‌కు, కర్నూలు వీఆర్‌లో పనిచేస్తున్న ఐ.జాన్సన్‌బాబురావును కర్నూలు ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్‌కు అదనపు సిఐగా బదిలీచేశారు. ఆర్.సోమశేఖర్‌రెడ్డిని కర్నూలు 3వ పోలీసుస్టేషన్‌కు, నంద్యాల వీఆర్‌లో పనిచేస్తున్న కె.జయరాములును నంద్యాల వీఆర్‌లోనే పోస్టింగ్ ఇచ్చారు. పాణ్యం సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న జి.జీవన్ గంగనాథ్‌బాబును నంద్యాల వీఆర్‌కు బదిలీచేశారు. ఆదోని 3వ పట్టణ అర్బన్ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న పి.నరేష్‌బాబును నంద్యాల ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌కు, నంద్యాల ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న వి.ప్రభాకర్‌రెడ్డిని నంద్యాల ఎస్‌బికి, కర్నూలు సిసిఎస్‌లో పనిచేస్తున్న డి.పార్థసారధిరెడ్డిని కర్నూలు పోలీసుస్టేషన్‌కు, నంద్యాల డీఎస్‌బిలో పనిచేస్తున్న జి.సుగుణకుమారిని కర్నూలు సిసిఎస్‌కు బదిలీచేశారు. బదిలీ అయిన సిఐలంతా తమకు కేటాయించిన సర్కిళ్లలో వెంటనే జాయిన్ కావాలని ఆదేశాలు జారీచేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..