నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువకు సోమవారం కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్యుడు అజయ్‌కుమార్ గుప్తా పర్యవేక్షణలో నీటిని విడుదల చేశారు. కుడి కాలువ 5, 7వ గేటు ద్వారా గేటు ద్వారా 2,500 క్యూసెక్కుల చొప్పున రెండు గేట్ల ద్వారా 5వేల క్యూసెక్కులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ మురళీధర్‌రెడ్డి, కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్యుడు అజయ్‌కుమార్ గుప్తా పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీఈ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాగునీటి అవసరాల నిమిత్తం ఐదు టీఎంసీల నీటిని రోజుకు ఐదు వేల క్యూసెక్కుల చొప్పున 11 రోజుల పాటు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కృష్ణానది యాజమాన్య బోర్డు ఈఈలు రఘునందనరావు, శివశంకర్, లింగంగుంట్ల సర్కిల్ ఎస్‌ఈ వరలక్ష్మి, సాగర్ ప్రాజెక్టు ఈఈ శ్రీహరి, డీఈలు మురళీధర్, వెంకటసుబ్బయ్య, జేఈలు బాబుమియా, భారతి, సాగర్ ప్రాజెక్టు సిబ్బంది పాల్గొన్నారు.