Monday, November 18, 2024

Exclusive | మరణిస్తూ అయిదుగురికి పునర్జన్మ.. బ్రెయిన్‌ డెడ్‌ యువకుడి అవయువ దానం!

గుంటూరు మెడికల్ , (ప్రభ న్యూస్‌): తాను మరణిస్తూ మరో ఐదు గురు జీవితాల్లో వెలుగు నింపాడు కట్ట కృష్ణ. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై బ్రెయిన్‌ డెడ్‌ అయిన యువకుడు అవయవదానంతో ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపాడు. పు-ట్టెెడు దు:ఖంలో ఉండి కూడా ఇతరులకు సాయం చేయాలని ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం అందరికీ మార్గదర్శకంగా నిలుస్తుంది. పెద్ద కుమారుడు మరణిస్తే అతని అవయవాలు దానం చేసి కుటుంబ సభ్యులు గొప్ప మనసు చాటుకున్నారు.

పల్నాడు జిల్లా చిలకలూరిపేట ప్రాంతానికి చెందిన కట్టా కృష్ణ (18) నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు అతడు 23వ తేదీన బస్సు కోసం వేచి ఉన్న సమయంలో అటు-గా వెళుతున్న ట్రావెల్స్‌ బస్సు వెనుక నుంచి వేగంగా వచ్చి అతనిని ఢీ కొట్టింది. అతనికి తలకి బలమైన గాయం తగలటం వలన వెంటనే అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు రమేష్‌ హాస్పిటల్‌ కి తరలించి చికిత్స అందించారు. వైద్యులు రక్షించే ప్రయత్నాలు ఫలించక కట్ట కృష్ణ బ్రెయిన్‌ డెడ్‌ అయ్యాడు.

గుంటూరు రమేష్‌ హాస్పిటల్‌ వారు అవయవ దానం పై మృతుడి తల్లిదండ్రులకు (కట్ట రాజు, మల్లేశ్వరి), బంధువులకు అవగాహన కల్పించారు. దీంతో కట్టా కృష్ణకు చెందిన లివర్‌, రెండు కిడ్నీలు, గుండె దానం చేశారు. ఇతరులకు అవయవాలను అమర్చేందుకు రమేష్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు-చేసిన గ్రీన్‌ ఛానల్‌ ద్వారా అవయవాలను గన్నవరం విమానాశ్రయానికి తరలించడం జరిగింది.కట్టా కృష్ణ గుండెను చాపర్‌ సహాయంతో తిరుపతి పద్మావతి హాస్పిటల్‌ కు తరలించారు.కాలేయాన్ని వైజాగ్‌ కిమ్స్‌ హాస్పిటల్‌ కిఒక కిడ్నీ ని విజయవాడ ఆయుష్‌ హాస్పిటల్‌ కిమరొక కిడ్నీని గుంటూరు రమేష్‌ హాస్పటల్లో అవసరమైన వారికి అమర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement