Thursday, November 21, 2024

మళ్లీ రిజిస్ట్రేషన్ బాదుడు .. భారీగా పెరగనున్న భూముల మార్కెట్‌ విలువ

ప్ర‌కాశం జిల్లాలో రిజిస్ట్రేషన్‌ బాదుడుకు రంగం సిద్దమైంది. ఇప్పటికే పెరిగిన చార్జీలతో ఆస్తుల క్రయ, విక్రయ దారులు భయపడుతుంటే.. మరో సారి పెంపున‌కు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఏప్రిల్‌ 1వ తేది నుంచి రిజిస్ట్రేషన్ చార్జీల పెంచేందుకు నివేదికలు సిద్దం చేయాలని సబ్‌ రిజిస్ట్రార్లకు ఆదేశాలందాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి మార్కెట్‌ విలువ పెంచేందుకు ప్రభుత్వం సిద్దమైంది.

ప్రభన్యూస్‌ బ్యూరో, ఒంగోలు: జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్‌ బాదుడుకు రంగం సిద్దమవుతోంది. వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి పెంచిన మార్కెట్‌ విలువల ధరలు అమలు కానున్నాయి. వీటతో పాటు కొత్తగా ఏర్పాటు కానున్న కొత్త జిల్లాల్లో కూడా రిజిస్ట్రేషన్ల విలువల బాదుడు పడనుంది. గతంలో ఏటా సగటున మార్కెట్‌ విలువ 10 శాతం వరకు పె రిగేది. కానీ గత ఏడాది ఈ పద్దతికి ప్రభుత్వం చెక్‌ పెట్టి..భూమికి ఉండే డిమాండ్‌ ఆధారంగా 10 నుంచి 40శాతం వరకూ పెంచింది. 2021లో నగరాలు, పట్టణాల సరిహద్దుల్లోని గ్రామీణ భూముల విలువ పుంచి ధరల వ్యత్యాసాన్ని తగి ్గంచి రిజిస్ట్రేషన్‌ భారగాన్ని ప్రజల పై మోపేందుకు పూనుకుంది. ఈ క్రమంలో ఏప్రిల్‌ ఒకటి నుంచి మరింతగా రిజిస్ట్రేషన్‌ చారీ ్జలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను డీ ఐజీలు, డీఆర్‌లు, సబ్‌ రిజిస్ట్రార్లకు ఆదేశాల ందాయి. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాల్లో భూముల మార్కెట్‌ విలువను భారీగా పెంచారు. గతంలో భూముల విలువ పెంపు కోవిడ్‌ కారణంగా వాయిదా పడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ప్రస్తుతం మళ్లీ తెరమీదకు రావడంతో సర్వత్రా క్రయ, విక్రయ దారుల్లో కలవరం మొదలైంది.

ఇదిలా ఉండగా కొత్త జిల్లాల ఏర్పాటు కానున్న నేపథ్యంలో కొత్త జిల్లాల్లోనూ రిజిస్ట్రేషన్‌ బాదుడు తప్పేట్టు లేదు. జిల్లాలో మూడుగా విభజించిన విషయం విధి తమే. పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాల ను కొత్త జిల్లా కేంద్రాలుగా ప్రకటించింది. దీంతో కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోకి, అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాలు బాపట్ల జిల్లాలో కలవనున్నాయి. అయితే పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ప్రజల పై రిజిష్ట్రేషన్‌ విలువను అడ్డంగా పెంచి మరింత భారాన్ని మోపబోతోంది. పేరుకు కొత్త జిల్లాలు అంటున్నా.. ప్రభుత్వ ఖజానా రాబడి కోసమేననే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విలువలను పెం చేందుకు కసరత్తు జరుగుతోంది. కొత్త జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఇప్పుడున్న రియల్‌ ఎస్టేట్‌ డిమాండ్‌ను పరిగణంలోకి తీసుకుని విలువలు ఎంత పెంచాలనేదాని పై లెక్కలు వేస్తోంది. ఈ మేరకు కొత్త జిల్లాల్లో జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఇంటి డోర్‌ నెంబర్లు, వాణిజ్య భవనాల నెంబర్ల కేటగిరీల వారీగా యుద్ద ప్రాతిపదికన నివేదికలు తయారవుతున్నాయి. ఇవి వచ్చిన తర్వాత ఆయా పాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్‌ విలువ ఎంత వరకు పెంచాలనేదాని పై సబ్‌ రిజిస్ట్రార్లు ప్రతిపాదనలు తయారు చేయనున్నారు. దీని పై జాయింటు కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీ ఆమోదముద్ర వేయనుంది.

కొత్త జిల్లాలు ఉగాడి నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నందున ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో భూములు, ఆస్తుల విలువలు పెరిగాయి. రియల్‌ ఎస్టేట్‌ పేరుతో రేట్లు పెంచేశారు. ఇప్పటికే సిద్దమైన వెంచర్లకు డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో వీటి వివరాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ల విలువను భారీగా సవరించడానికి ప్రభుత్వం అంచనాలు సిద్ధం చేస్తోంది. ఏయేటకాయేడు భూముల విలువ పెంపు ద్వారా రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచుకోవ డం ప్రభుత్వానికి ఆనవాయితీగా వస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో కొత్తగా భూముల విలువ పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది మార్చిలో నిర్ణయించింది. అంతుకు ముందు ఏడాదిలో భూముల వినియోగ మార్పిడి ఎక్కడెక్కడ ఎక్కువ జరిగింది..?అనే దాని పై రెవెన్యూశాఖ, రహదారుల పక్కనున్న గ్రామాలు, పట్టణాల్లో సర్వే నెంబర్లు సేకరించి అక్కడ భూముల విలువలు ఎంత వరకు పెంచవచ్చనేది ప్రతిపాదనలు సిద్దం చేశారు. కొత్తగా సాగులోకి వచ్చిన భూములు, ఆక్వాసాగు చేసే మండలాలతో పాటు, గ్రానైట్‌ గనుల తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలకు సంబంధించి సమాచారం సంబంధిత శాఖల నుంచి సేకరించి..విలువలు పెంచాలనేది నిర్ణయించారు. కానీ కోవిడ్‌ కారణంగా గతేడాది విలువలు పెంపును ప్రభుత్వం వాయిదా వేసింది. ఇప్పుడు ఆ పాత ప్రతి పాదనల ఆధారంగా కొత్త జిల్లాల్లో ప్రస్తుతం రియల్‌ ఏస్టేట్‌ ఆంచనాలను బేరీజు వేసుకుని ప్రస్తుతం విలువ పై 25శాతం వరకు అదనంగా పెంచడానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలోనూ చివరి సారిగా 2019 ఆగస్టులో రూరల్‌ పరిధిలో, 2020 ఆగస్టులో మున్సిపల్‌ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచారు. ఆ సమయంలో రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచడంతో పేదల సొంతింటి కల ప్రశ్నార్థకంగా మారిందని పలువురు వాపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement