Monday, November 25, 2024

రిజిస్ట్రేషన్‌శాఖలో సంస్కరణలు.. డిజిటల్‌ రూపంలో నూతన స్టాంపుల విధానం

కృష్ణా, ప్రభన్యూస్ : రిజిస్ట్రేషన్‌శాఖలో అక్రమాలకు చెక్‌పెట్టేందుకు ప్రబుత్వం అనేక సంస్కరణలు తీసుకువస్తున్నా ఫలితం కనిపించడం లేదు. తొలుత దళారీవ్యవస్థను రూపుమాపేందుకు నేరుగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది. పాదర్శకంగా ఉండేందుకు క్రయవిక్రయాలు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. అయినా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలలో అక్రమాలు యధేచ్ఛగా సాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో నకిలీ ష్టాంపులను నివారించేందుకు డిజిటల్‌ స్ఠాంప్‌ల విధానానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ డిజిటల్‌ స్ఠాంప్‌ల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించడం గమనార్హం. డాక్యుమెంట్‌ పరంగా మాన్యువల్‌ స్టాంపులు ఉండాలనే సెంటిమెంట్‌ కూడా ఉంది. అందుకే గతంలో కూడా ప్రభుత్వం ఈ-డాక్యుమెంట్‌ను తీసుకు వచ్చినప్పటికీ విజయవంతం కాలేదు. ఈ నేపథ్యంలో నూతంగా తీసుకువస్తున్న డిజిటల్‌ స్టాంప్‌ల విధానం ఎంతవరకు విజయవంతమవుతుందో వేచిచూడాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement