చినకాకాని అపార్టుమెంట్ వాసులతో మీటింగ్
బోధనా రుసుం చెల్లింపులలో మార్పు తెస్తాం
యువగళంపై రచించిన శకారంభం పుస్తకావిష్కరణ
మంగళగిరి: టీడీపీ అధికారంలోకి రాగానే బోధనా రుసుముల చెల్లింపుల్లో పాత విధానాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. చినకాకానిలో అపార్టుమెంట్ వాసులతో ఇవాళ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్నారు. వైకాపా ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు తాను సిద్ధమని సీఎం జగన్‌కు సవాల్ విసిరారు. మండుటెండల్లోనూ రోజుకు మూడు సభల్లో పాల్గొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు యువకుడిలా తిరుగుతున్నారని.. ఏసీ బస్సుల్లో తిరుగుతున్న సీఎం మాత్రం మూడు రోజులకోసారి విరామం తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
“శకారంభం” పుస్తకం ఆవిష్కరణ
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా నారా లోకేష్ చేపట్టిన వగళం పాదయాత్రకు అక్షర రూపమిస్తూ సీనియర్ జర్నలిస్టు పెమ్మరాజు కృష్ణకిషోర్ రచించిన “శకారంభం” పుస్తకాన్ని లోకేష్ ఇవాళ ఆవిష్కరించారు.. జగన్ పాలనలో బాధితులుగా మారిన వివిధవర్గాల ప్రజలకు నేనునాన్నని భరోసా ఇస్తూ చేపట్టిన పాదయాత్రలో ప్రతి ఘట్టాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ సందర్బంగా లోకేష్ రచయిత కృష్ణ కిషోర్ ను అభినందించారు.