కేంద్రం ఎకసైజ్ సుంకం తగ్గించిన తర్వాత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రో ధరలు నిన్న కాస్తంత పెరిగాయి. మళ్లీ ఇవ్వాల తగ్గుముఖం పట్టాయి. ఇవ్వాల హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుపై రూ.0.17 పైసలు తగ్గి రూ.109.66గా ఉంది. ఇక డీజిల్ ధర లీటరుకు రూ.0.16 పైసలు తగ్గి రూ.97.82 గా ఉంది. వరంగల్‌లో అయితే కాస్త రేటు పెరిగింది. నేడు (మే 31) పెట్రోల్ ధర రూ.0.27 పైసలు పెరిగి రూ.109.43 గా ఉంది. డీజిల్ ధర రూ.0.24 పైసలు పెరిగి రూ.97.59గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్‌లో పెట్రోల్ ధర నేడు రూ.0.71 పైసలు తగ్గింది. దీంతో పెట్రోల్ ధర రూ.110.95 గా ఉంది. డీజిల్ ధర నేడు రూ.0.67 పైసలు తగ్గి రూ.99.01 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో మార్పులు బాగా ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో..
విజయవాడ మార్కెట్‌లో ఇంధన ధరలు ఇవ్వాల పెరిగాయి. పెట్రోల్ ధర నేడు రూ.0.05 పైసలు పెరిగి రూ.111.97 గా ఉంది. డీజిల్ ధర రూ.0.05 పైసలు పెరిగి రూ.99.70 గా ఉంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ కూడా కాస్త ధర పెరిగింది. ముందు రోజుతో పోలిస్తే పెరిగింది. లీటరు ధర రూ.0.45 పైసలు పెరిగి రూ.111.23 గా ఉంది. డీజిల్ ధర కూడా నేడు రూ.0.42 పైసలు పెరిగింది. దీంతో ధర రూ.98.97గా ఉంది. అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత ఏడాది కాలంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. అప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ప్రస్తుతం 100 డాలర్లకు అటు ఇటుగా ఉండగా.. మే 31 నాటి ధరల ప్రకారం ముడి చమురు బ్యారెల్ ధర 117.61 డాలర్ల స్థాయిని చేరింది.