Thursday, November 21, 2024

చ‌ట్టాల ప్ర‌కార‌మే పున‌ర్విభ‌జ‌న : ఎంపీ క‌న‌క‌మేడ‌ల

చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందని, చట్టాల ప్రకారమే పునర్విభజన చట్టం ఇప్పటికే అమలు చేశారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ అన్నారు. దీని ప్రకారమే ఏపీ రాజధానిగా అమరావతి ఏర్పాటు చేశారని అన్నారు. ఈ రోజు ఢిల్లీలో మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వమే చట్టాన్ని పార్లమెంట్‌లో ఆమోదించిందని ఆయ‌న చెప్పారు. రాజ్యాంగాన్ని మారుస్తామంటే కుదరదని, న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవన్నారు. కొంద‌రు జడ్జిలను కూడా బెదిరించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. న్యాయ‌స్థానం ఇచ్చిన‌ తీర్పులపై సభలో వక్రభాష్యాలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించకూడ‌ద‌ని ఆయ‌న అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement