తిరుపతి సిటీ, జూన్ 6 (ప్రభ న్యూస్) : ఎర్రచందనం ఆక్రమంగా తరలివెళ్తుండగా సమాచారం రావడంతో భాకరాపేట సిఐ తులసీరామ్, ఎర్రవారి పాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది స్మగ్లర్లపై దాడిచేసి 72 ఎర్రచందనం రిఫర్లతో పాటు దాచి ఉంచిన చెక్కలు పోటీ కలిగిన బ్యాగులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని చంద్రగిరి డీఎస్పీ జస్వంత్ తెలియజేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ… కోటి రూపాయల విలువ కలిగిన దుంగలతో పాటు ఒక లారీ, రెండు కార్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని వివరించారు.
తమిళనాడుకు చెందిన మహమ్మద్ రసూల్, కార్తీక్, భాస్కరన్, జేసురాజుతో పాటు అన్నమయ్య జిల్లాకు చెందిన తిరుమల శెట్టి నాగరాజు, అమరేంద్ర రాజును అరెస్టు చేయడం జరిగిందని పేర్కొన్నారు. పట్టుబడిన రసూల్ పై 25 కేసులు గతంలో ఉన్నట్లు తెలిపారు. పీడియాక్ట్ లో జైలు జీవితం అనుభవించడం జరిగిందన్నారు. అలాగే పట్టుబడిన నిందితుల్లో పీడీ యాక్ట్ కేసు పెట్టేందుకు ప్రణాలిక చేపట్టడం జరుగుతుందన్నారు. ఢిల్లీకి చెందిన ఇరువురు ప్రధాన నిందితులను గుర్తించి వారిని పట్టుకునేందుకు అన్వేషణ జరుగుతుందన్నారు.