హైదరాబాద్ – ఓట్ల కోసమే మాజీ సీఎం కేసీఆర్‌ను జగన్ కలిశారని విమర్శలు గుప్పించారు సీపీఐ జాతీయ సహాయ కార్యదర్శి నేత నారాయణ .. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, . ఇంట్లో కుంపటి వ్యాఖ్యలు చేసి.. జగన్ తన ఓటమిని ఒప్పుకున్నారన్నారు. తన ఇంట్లో తానే జగన్ గొడవ సృష్టించుకుని ఇతరులను నిందిస్తున్నారన్నారు. చెల్లిని, బాబాయ్‌ను దూరం చేసుకున్నారని . అధికారానికి కూడా దూరమవుతారని జ్యోస్యం చెప్పారు..
జగన్ లో ఓటమి భయం..
జగన్‌లో మెదటసారి ఓటమి భయం కన్పిస్తుందని.. అందుకే చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో సాయం కోసమే జగన్.. కేసీఆర్ దగ్గరకి వవ్చారన్నారు. కేసీఆర్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలని ప్రయత్నించి జగన్ విఫలమయ్యారన్నారు. పొత్తు పేరుతో చంద్రబాబును బీజేపీ నష్టపరచాలని చూస్తోందని అన్నారు. తమను ప్రశ్నించిన వారిని కేంద్రం 17ఏ పేరుతో బెదిరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, జగన్‌ను కూడా 17ఏతో బీజేపీ భయపెట్టిస్తోందని నారాయణ వ్యాఖ్యలు చేశారు.