Thursday, November 7, 2024

Vizag : రెడ్ అలెర్ట్..!.. నగరాన్ని జల్లెడ పట్టిన విశాఖ పోలీసులు

నగరంలోకి అనుమానితుల చొరబాటు!
100 పోలీసు స్పెషల్ టీం లతో దాడులు
100కు పైగా లాడ్జిలు, హోటల్స్ లలో ఆకస్మికతనిఖీలు
అదుపులో పలువురు అనుమానితులు
అత్యధికంగా గంజాయి బ్రోకర్లు,స్మగ్లర్లు అదుపులోకి తీసుకున్న పోలీసులు
గంజాయి, కార్లు, బైకులు స్వాధీనం..!

విశాఖ క్రైం, ప్రభ న్యూస్ : పలువురు అనుమానితులు నగరంలోకి వచ్చినట్లు ఇంటెలిజెన్స్ సమాచారంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచి పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల అన్ని లాడ్జీలు, హోటల్స్ లలో 100 పోలీస్ టీములతో ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈ దాడులు తెల్లవారుజామున 5 గంటల నుండి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇందులో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే గంజాయి, కార్లు, బైక్ ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు ఇంటెలిజెన్స్ హెచ్చరికతో విశాఖ పోలీసులు అలెర్ట్ అయ్యారు! మొన్న వెస్ట్ బెంగాల్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ముగ్గురు నగరంలోని రామనగర్ బాయ్స్ హాస్టల్ లోకి మారనాయుధాలతో ప్రవేశించినట్లు సమాచారం రావడంతో ఆక్టోపస్ బలగాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే ఆ గ్యాంగ్ తప్పించుకున్నట్లు తెలుస్తుంది. నేడు అలాంటి సమాచారం రావడంతో లాడ్జి, హోటల్స్ లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇదిలా ఉండగా తాజా ఇంటెలిజెన్స్ సమాచారంతో శుక్రవారం తెల్లవారుజామున లాడ్జీలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. సీపీ శంఖబ్రత బాగ్చీ అదేశాలతో జాయింట్ సీపీ పకిరప్ప ఆధ్వర్యంలో 100 స్పెషల్ టీమ్స్ తో ఈ తనిఖీలు నిర్వహించారు. అనుమానితులు ఉన్నారనే సమాచారంతో ఏకకాలంలో నగరంలోని అన్ని లాడ్జీలు హోటల్స్ లో అణువణువునా తనిఖీలు చేశారు. పోలీస్ దాడుల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇంటలిజెన్స్ సమాచారం మేరకు ఇతర రాష్ట్రాల నుండి కొందరు గంజాయి స్మగ్లర్లు నగరంలోకి చొరబడినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు పోలీసులు క్షుణ్ణంగా లాడ్జీల రికార్డులు పరిశీలన చేశారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని వివిధ‌ ప్రాంతాల్లో నుండి వచ్చిన వారిపై కూడా అరా తీస్తున్నారు. సిటీ పరిధిలో ఉన్న లాడ్జీల్లో గంజాయి ప్రత్యేక్షం కావడంతో పోలీసులు అవాక్కయ్యారు. ప్రస్తుతం లాడ్జీలు గంజాయి బ్రోకర్లకు అడ్డగా మారింది! సీపీ శంఖబ్రత బాగ్చీ వ్యూహాలతో నగరంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జాయింట్ సీపీ పకిరప్ప పర్యవేక్షణలో భారీగా లాడ్జీలపై పోలీసులు మోహరింపు చేపట్టారు. ఈ క్రమంలోనే కార్లు, బైక్స్, గంజాయి స్వాధీనం చేసుకుని, అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

నిఘా నీడలో నగరం..
విశాఖ పోలీసులు నగరాన్ని జల్లెడ పడుతున్నారు. అనుమానితులను ఎవరినీ వదలడం లేదు. ఇంటలిజెన్స్ సమాచారం మేరకు ఎక్కడకక్కడ విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. విశాఖ నగరంలోని లాడ్జీలు, హోటల్స్ లలో పకడ్బందీగా 100 ప్రత్యేక పోలీస్ టీమ్ లతో వరుస దాడులు కొనసాగించారు. వివిధ పనుల నిమిత్తం అలాగే ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చిన వారిలో కొందరు అసాంఘీక శక్తులున్నారని సమాచారం ఉండటంతో నగర పోలీస్ కమిషనర్ ఇప్పటికే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అన్ని ప్రాంతాల్లో పోలీసు నిఘాను పెంచారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పోలీసు మ‌ఫ్టీలో డేగ కన్నుతో అసాంఘీక శక్తులపై నిఘా ఉంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement