Saturday, September 14, 2024

AP Rains | పలు జిల్లాల‌కు రెడ్ అలెర్ట్…. రేపు కూడా సెల‌వే !

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి జిల్లా, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, ఎన్టీఆర్‌, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీకి మళ్లీ వాన ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు, వరద తీవ్రత దృష్ట్యా శుక్రవారం స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తాజాగా ప్రకటన విడుదల చేశారు.

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే భారీ వర్షాలు పడుతున్నందున జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement