Sunday, November 24, 2024

AP | విశాఖ పోర్టు కొత్త రికార్డు.. చరిత్రలో అత్యధిక సరుకు రవాణా

విశాఖపట్నం, ప్రభన్యూస్‌: విశాఖపట్నం పోర్టు అధారిటి సరుకు రవాణాలో నూతన అధ్యాయాన్ని లిఖించింది. ఇప్పటి వరకూ సరుకు రవాణలో పోర్టు చేసిన రికార్డులను తిరగ రాసి నూతన రికార్డును నెలకొల్పే దిశగా పరుగులు పెడుతోంది. 2023-24 ఆర్ధిక సంవత్సరం ముగియకుండానే పోర్టు ఈ ఏడాది 73.78 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సరుకును రవాణా చేసి గత ఏడాది చేసిన అత్యధిక సరుకు రికార్డును తిరగరాసిందని విశాఖ పోర్టు ట్రస్టు చైర్మన్‌ డాక్టర్‌ ఎం.అంగముత్తు తెలిపారు.

1933లో నెలకొల్పిన పోర్టు ఈ ఏడాదికి 90 ఏళ్లను పూర్తి చేసుకుంది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో పోర్టు చేసిన 73.73మిలినయ్‌ మెట్రిక్‌ సరుకు రవాణానే ఇప్పటి వరకూ పోర్టు చరిత్రలో అత్యధిక సరుకు రవణాగా రికార్డులలో ఉండేది. అయితే ఈ ఏడాది మార్చి 2 నాటికే పోర్టు ఆ రికార్డును తిరగరాసి 73.78 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సరుకును రవాణా చేసింది. విశాఖపట్నం పోర్టు చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ ఎం అంగముత్తు సమర్ధవంతమైన నాయకత్వంలో డిప్యూటీ చైర్‌ పర్సన్‌, విభాగాధిపతులు సమన్వయం కారణంగా పోర్టు ఈ ఘనతను సాధించిందని చెప్పవచ్చు.

ఈ సందర్భంగా 90 ఏళ్ల చరిత్రలో తొలిసారి అర్థసంవత్సరం గడువు ముగియకుండానే ఇంతటి ఘనత సాధించడం పట్ల పోర్టు చైర్‌ పర్సన్‌ సంతృప్తిని వ్యక్తం చేశారు. అత్యధిక సరుకు రవాణా రికార్డును నెలకొల్పడం పట్ల ఆయన ట్రాపిక్‌ మేనేజర్‌ బి.రత్న శేఖర్‌ రావును, ఆయన టీ-ం ను ప్రత్యేకంగా అభినందించారు. డిప్యూటీ- కన్వర్వేటర్‌, పలు విబాగాధిపతులను చైర్మన్‌ ప్రశంసించారు. ఈ ఏడాది పోర్టు 80మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల రికార్డును నెలకొల్పాలని ఈ సందర్బంగా చైర్‌ పర్సన్‌ అంగముత్తు ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement