Monday, November 18, 2024

మే నెలలో రికార్డ్ స్తాయిలో హుండీ ఆదాయం..

తిరుమల, ప్రభన్యూస్ : టీటీడీ చరిత్రలోనే మే నెలలో తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా గత నెలలో శ్రీవారికి 129 కోట్ల 93 లక్షలు రూపాయలను హుండీ ద్వారా భక్తులు సమర్పించారు. గతంలో ఎప్పుడు కూడా ఒక నెలలో ఇంత పెద్ద మొత్తం ఆదాయం శ్రీవారికి లభించిన దాఖలాలు లేవు. దీంతో ఈ ఏట హుండీ ద్వారా 13 వందల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం స్వామివారికి లభించే అవకాశం కనిపిస్తుంది. కోట్లాను కోట్ల భక్తుల శరణాగతుడైన తిరుమలేశుడి దర్శనార్ధం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు.

శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్న భక్తులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం తమ మొక్కులను చెల్లించుకుం టారు. భక్తులు తమతమ తాహతును భట్టి శ్రీవారికి కానుకలు సమర్పిస్తారు. మరికొందరు భక్తులు అయితే స్వామివారికి నిలువుదోపిడి సమర్పిస్తారు. ఇలా శ్రీవారి భక్తులు సమర్పించే కానుకలు గతంలో వేలలో అటు తర ువాత లక్షలలో ఉండగా నేడు కోట్లకు చేరుకుంది. గతంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తున్న సంఖ్య వందలలో ఉండగా కాల క్రమేన భక్తుల సంఖ్య పెరుగుతూ లక్షలలోకి చేరుకుంది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ స్వామివారి హుండీ ఆదాయం పెరుగుతూ వస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement