Monday, November 25, 2024

IMD:రికార్డ్ స్థాయిలో ఎండ‌లు.. అత్య‌వ‌స‌రం అయితేనే బ‌య‌ట‌కి వెళ్లండి

ఈ సంవ‌త్స‌రం ఎండ‌లు అధికంగా ఉంటాయ‌ని ఎండ‌లు చూస్తేనే తెలుస్తుంది. కాగా సూర్యుని నుండి వెలువడే వేడిమిని తట్టుకోలేక ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. ఇంకా తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఎండలు రికార్డ్ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. మాములుగా ఎప్పుడూ ఉష్ణోగ్రతల కన్నా ప్రస్తుతం మరీ ఎక్కువగా ఎండలు ఉండడం బాధాకరం అని చెప్పాలి. రోజులో సాధారణ డిగ్రీల కన్నా కూడా రెండు డిగ్రీలు ఎక్కువగానే నమోదు అవుతున్నట్లు IMD తెలియచేసింది. కాగా నిన్న రెంటచింతలలో అత్యధికంగా 42 .6 డిగ్రీలు, నెల్లిమర్ల లో 41 .9 డిగ్రీలు, రాజాంలో 41 .8 డిగ్రీలు, కర్నూల్ 41 .5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కాగా ఈ రోజు అడ్డతీగల , నెల్లిపాక , చింతూరు , గంగవరం, నర్సీపట్నం, మాకవరపాలెం తో పాటు 26 మండలాల్లో వడగాలులు వీస్తాయని IMD తెలిపింది. ఏదైనా అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని, వెళ్లినా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్ర‌జ‌లు డీహైడ్రేష‌న్ కి గురి కాకుండా నీటిని ఎక్కువ‌గా తాగుతుండాల‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement