- కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్.
- 9 మంది ఏఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతి
కర్నూల్ బ్యూరో : రాయలసీమ రేంజ్ లోని ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన 9 మంది ఏఎస్సైలకు (1991 బ్యాచ్) ఎస్సైలుగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన ఎస్సైలు.. కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో శుక్రవారం కర్నూలు రేంజ్ డీఐజీని కలిశారు.
ఈ సందర్భంగా పదోన్నతి పొందిన 9 మంది ఎస్సైలను కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ అభినందించారు. పదోన్నతులతోనే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం వస్తుందని అన్నారు. ఎలాంటి రిమార్కు లేకుండా మిగిలిన సర్వీసును పూర్తి చేసి విధుల్లో మంచి పనితీరు కనబరిచి మరిన్ని పదోన్నతులు పొందాలని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఎస్సైలకు సూచించారు.