Tuesday, September 17, 2024

Reception – అనంత్ , రాధికలో పెళ్లి విందుకు చంద్ర బాబు

సీఎం చంద్రబాబు నేటి. సాయంత్రం ముఖేష్ అంబానీ కుమారుడి వివాహానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.

అలాగే నేడు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ హరే కృష్ణ గోకుల్ క్షేత్రానికి వెళ్లనున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో జరగనున్న అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్ననున్నారు.

అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వెళ్లనున్నారు. ప్రజల నుంచి వచ్చే వినతలను చంద్రబాబు స్వీకరించనున్నారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించేందుకు ఇటీవల టోల్ ఫ్రీ నంబర్‌ను పల్లా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ కార్యాలయంలో చంద్రబాబు అందుబాటులో ఉండనున్నారు.

ఇవాళ సాయంత్రం ముఖేష్ అంబానీ కుమారుడు వివాహ వేడుకలకు ఆయన వెళ్లనున్నారు. శనివారం సాయంత్రం 4:30 నిమిషాలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు ముంబైకి వెళ్ళనున్నారు. రాత్రికి ముంబైలోనే బస చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లి నివాసానికి తిరిగి చంద్రబాబు చేరుకోనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement