Friday, November 22, 2024

ఫేక్ క‌రెన్సీ ముఠా మోసం – రూ.2.50 కోట్లు పొగొట్టుకున్న రియ‌ల్ట‌ర్

ఉమ్మడి కర్నూలు జిల్లా (నంద్యాల) – నంద్యాలలో ఘరానా మోసం చోటుచేసుకుంది. శనివారం ఈ ఘ‌ట‌న వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే అసలు నోట్లకు మూడింతలు ఫేక్ నోట్లు ఇస్తామని స్థానికుడైన రియల్టర్ మదన్ మోహన్ రెడ్డి ని ఓ ముఠా బురిడీ కొట్టించింది. ఫేక్ ముఠాకు రియల్టర్ దాదాపు రూ.2.50 కోట్లు అప్పజెప్పి మోసపోయాడు. నగదు

మార్పిడి సమయంలో సినిమా పక్కిలో సైరన్ కొడుతూ వచ్చిన ఫేక్ పోలీస్ జీప్ రాగ, షేక్ ముఠా డబ్బుతో ఉడా ఇచ్చింది. చేసేది లేక బాధితుడు మోహన్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. నిందుతులకోసం మూడు బృందాలతో పోలీసులు వేట సాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement