Friday, November 22, 2024

AP : నేటి నుంచి మేమంతా సిద్ధం…బ‌స్సుయాత్ర‌కు జ‌గ‌న్ శ్రీ‌కారం…

ఇవాళ్టి నుంచి మేమంతా సిద్ధం పేరుతో జ‌గ‌న్ బ‌స్సు యాత్ర చేప‌ట్ట‌నున్నారు. ఎన్నిక‌ల నేప‌థ్యంలో సీఎం జగన్ ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ యాత్ర 21 రోజులపాటు కొనసాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది.

- Advertisement -

సీఎం జగన్ బుధవారం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్ననానికి ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ప్రార్థనలు చేస్తారు. అనంతరం బస్సు యాత్రను ప్రారంభిస్తారు.

తొలిరోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి వేంపల్లి, వీర పురాయనిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి దువ్వూరు, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర జరగనుంది. సిద్ధం సభలు జరిగిన నాలుగు పార్లమెంట్ నియోకజవర్గాలు మినిహా మిగిలిన 21 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగనుంది.

తాజాగా వైసీపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేము సిద్ధం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలు క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఇదే ఊపును కొనసాగించేందుకు వైసీపీ అధినేత మరో ముఖ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. మేమంతా పేరుతో బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలను మినహాయించి మిగిలిన నియోజకవర్గాలు కవర్ అయ్యేలా బస్సు యాత్ర రూట్ మ్యాప్‌ను వైసీపీ ముఖ్య నేతలు సిద్ధం చేశారు. గతంలో ఓదార్పు యాత్ర జరిగిన తీరును తలపించేలా మేమంతా సిద్ధం యాత్ర ఉండబోతుందని స్పష్టం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement