చ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, వైసిపి అధిష్టానం పిలుపు కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు సినీ నటుడు అలీ.. రాజమండ్రిలో క్రికెట్ టోర్నమెంట్ ను ఎంపీ మార్గాని భరత్తో కలిసి అలీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీపై ఈ వారంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చే చాన్స్ ఉందని చెప్పారు.
రాజకీయాల్లో ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు అని అన్నారు. ఎన్నికల వేళ పొత్తులు పెట్టుకోవడం కూడా సహజం అని చెప్పారు. కానీ, అంతిమ విజయం ఎవరిదో ప్రజలే నిర్ణయిస్తారని వెల్లడించారు. ఇది ఇలా ఉంటే అలీకి ఎంపీ సీటు కేటాయించే ఛాన్స్ ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నారు. ఓ మైనార్టీకి చాన్సివ్వాలని అనుకుంటున్న జగన్ ఈ నటుడి పేరును పరిశీలనలోకి తీసుకుంటున్నారని సమాచారం.