Tuesday, November 26, 2024

రాయలసీమ యూనివర్సిటీ సమస్యల తిష్ట..

రాయలసీమ యూనివర్సిటీలో ముగ్గురు అక్రమ ప్రొఫెసర్లుకు ఉపకులపతి ఉన్నత పదవులు కట్టబెట్టారని విద్యార్థులు ఆరోపించారు. నకిలీ సర్టిఫికెట్లులతో కొంతమంది యూనివర్సిటీలో పదవులను పొందుతూ ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారని  ఆరోపిస్తున్నారు. వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాజరు శాతం తక్కువగా ఉందన్న కారణంతో 120 మందికిపైగా విద్యార్థులను పీజీ  మొదటి సంవత్సరం లో పరీక్షలకు యూనివర్సిటీ అధికారులు అనుమతి ఇవ్వలేదు. పీజీ రెండో సంవత్సరం పరీక్షలకు ఆ విద్యార్థులను అనుమతి నిరాకరించారు‌. కరోనా సమయంలోని యూనివర్సిటీలో తరగతులు ఆన్లైన్ తరగతులు, అనంతరం ఆఫ్ లైన్ తరగతులు నిర్వహించారు. కరోనా పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు తరగతులకు హాజరు అయ్యారని విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. యూనివర్సిటీలోని పలు సమస్యలపై ప్రశ్నిస్తే తమపై అనవసరంగా సస్పెండ్ చేస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించిన యూనివర్సిటీని ప్రక్షాళన చేయాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement