Tuesday, November 26, 2024

నిండుకుండలా రాయలచెరువు.. నీట మునిగిన అయిదు గ్రామాలు

చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు గ్రామాలు వ‌ర‌ద నీటిలో చిక్కుకున్నాయి. రాయలచెరువు పూర్తి స్థాయిలో నిండి దాని చుట్టుప‌క్క‌ల గ్రామాల‌న్నీ నీట మునిగాయి. చెరువు స‌మీపంలోని సీకే పల్లి, రాయల్ చెరువుపేట, సూరావారి పల్లి, గొల్లపల్లి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.. ప్రజలు ఎవరు బయటకు రావొద్ద‌ని అధికారులు హెచ్చరికలు చేశారు.

రాయలచెరువుకు అనుపల్లి నుంచి వరద ప్రవాహం ఎక్కువగా రావడం.. తూముల ద్వారా అవుట్ ఫ్లో తక్కువగా ఉండ‌డంతో ఈ ప‌రిస్థితి త‌లెత్తింది. దీనివల్ల రాయలచెరువు గ్రామంలో సుమారు 100 ఇండ్లు నీటి మునకలో వున్నాయి. కుప్పంబాదురు మార్గంలో ఉన్న రాయలచెరువు మొరవను ఆక్రమణలను అధికారులు తొలగించినప్పటికీ చెరువు లోని వరద నీరు తక్కువ మొత్తంలో మొరవ ద్వారా వెళుతున్నాయి.

దీంతో రాయల చెరువు కట్ట కింద ఉన్న గ్రామాల ప్రజలు ఎక్కడ రాయలచెరువు తెగిపోతుందా అనే భయంతో నిద్రలేకుండా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని భయాందోళనకు గురి అయ్యారు. నీటి పారుదల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు కుప్పం బాదురు వైపు ఉన్న రాయలచెరువు మొరవను లోతుగా తీసి చెరువులోని నీరు బయటకు పంపించాలని కోరుకుంటున్నాను.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట్టర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement