Tuesday, November 19, 2024

Rayadurgam – క‌న్నేసిన ఎన్ఐఏ – రాడార్‌లో రిటైర్డ్ హెడ్‌మాస్ట‌ర్‌, టెకీ

ఉగ్ర‌వాదుల లింకుల‌పై అనుమానాలు
అనంత‌పురం జిల్లా రాయదుర్గంలో తనిఖీలు
ఓ వ్య‌క్తి నుంచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
అదుపులో బెంగళూరుకు చెందిన‌ టెకీ
విశ్రాంత ప్రధానోపాధ్యాయుడిపై విచారణ

ఆంధ్ర‌ప్ర‌భ బ్యూరో, అనంతపురం: అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ దాడులు జ‌రిగాయి. ఈ దాడుల‌తో మంగళవారం తెల్లవారుజామునే రాయదుర్గం ప్ర‌జ‌లు ఉలిక్కిపడ్డారు. రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్.ఐ.ఏ సోదాలు నిర్వ‌హించింది. బెంగళూరులో నివాసం ఉంటున్న అబ్దుల్ కొడుకులు కొన్నాళ్లుగా అదృశ్యమయ్యారు. వీరిద్దరి వ్యవహారాలు అనుమానాస్పదంగా ఉండడంతో ఎన్ఐఏ నిఘా పెట్టింది. ఉగ్రవాదులతో లింకులపై ఆరా తీశారు. నాగులబావిలో తనిఖీలు నిర్వహించి రిటైర్డ్ హెడ్మాస్టర్ అబ్దుల్ నుంచి వివరాలను రాబట్టారు.

- Advertisement -

ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదుపులోకి..

ఏపీలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌‌ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం తహసీల్దార్ రోడ్డులోని ఓ వీధిలో రిటైర్డ్ హెడ్ మాష్టార్ అబ్దుల్ ఇంట్లో మంగళవారం ఉదయం సోదాలు చేశారు. ఆయన చిన్న కుమారుడు సోహెల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు బెంగుళూరులోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. కొద్దిరోజులుగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ పేరుతో ఇంట్లో నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. కొద్దిరోజుల కిందట సోహెల్ బ్యాంకు అకౌంట్‌కు భారీ మొత్తంలో నిధులు జమ కావటంతో అతడి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. సోహెల్‌కు ఉగ్రవాదులతో ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement