అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర గురువారం సచివాలయం మొదటి బ్లాకులో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వేదపండితులు ఆయనకు ఆశీస్సులు అందజేశారు. అనంతరం పలువురు అధికారులు, సిబ్బంది రవిచంద్రకు పుచ్చగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
తదుపరి ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. అంతకు ముందు టిఆర్‌అండ్బి ముఖ్యకార్యదర్శి ప్రద్యుమ్న, గుంటు-రు జిల్లా కలెక్టర్ యం.వేణు గోపాల్ రెడ్డి, ఎస్పి తుషార్ గూడి, న్యాయశాఖ కార్యదర్శి సత్య ప్రభాకర్, ప్రోటోకాల్ డైరక్టర్ బాల సుబ్రహ్మణ్యం రెడ్డి, సచివాలయ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.