అమరావతి, ఆంధ్రప్రభ: పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విలీనానికి ముందే రేషలైజేషన్ జరపాలని, విలీనమయ్యే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్ట్‌లను పాఠశాల సహాయకులు పోస్టులుగా అప్‌గ్రేడ్ చేయాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ, మాగంటి శ్రీనివాసరావు, ఫోర్టో రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 11, 12 తరగ తులను వెంటనే ప్రారంభించాలని, ఉమ్మడి సర్వీసు సాధనకు కృషి చేయాలని, 223 జీవో రద్దు చేసి పాఠశాల సహాయకులకు జూనియర్ లెక్చరర్ల పదోన్నతి కల్పించాలని కోరారు. ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి మినహాయించాలన్నారు. అప్‌గ్రేడ్ అయిన ఉన్నత పాఠశాలలకు గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుల పోస్టులు మం జూరు చేయాలని, ఖాళీగా ఉన్న మండల విద్యాశాఖాధికారి పోస్టులను భర్తీ చేయా లని కోరారు.
మండల విద్యాశాఖ అధికారులకు డీడీఓ పవర్ కల్పించాలని, ఎంఈ వో కార్యాలయంగా మార్చాలని విన్నవించారు. 20 సంవత్సరాలుగా నిలిచిపోయి న పదోన్నతులు డీవైఈవో, డైట్ లెక్చరర్లు పదోన్నతుల మార్గానికి సుగమం చేయా లని, మధ్యాహ్న భోజన కార్మికులకు నెలవారి బిల్లు చెల్లింపు జరిగేలా చూడాలని కోరారు. ఆయాలకు ప్రతి నెలా జీతాలు చెల్లింపు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేజీబీవీల్లో సీఆర్టీలకు మినిమం -టైం స్కేల్ వర్తింపచేయాలని విజ్ఞప్తి చేశారు. కార్య క్రమంలో రాష్ట్ర నాయకులు ప్రేమనాథ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కేశవ రెడ్డి హరినాథ్, రెడ్డి శేఖర్ సత్యనారాయణ మూర్తి, కేశాని ప్రభాకర రావు, డొక్కా శ్రీనివాసరావు, అంగడాల మురళి కృష్ణ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.